రాయదుర్గం: బొమ్మనహాళ్ లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో 'వనం-మనం'
జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో బొమ్మనహాల్ ZP హైస్కూల్లో గురువారం 'వనం-మనం' కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ నబిరసూల్, MEO లు వీరన్న, మల్లికార్జున, సంస్థ బొమ్మనహాల్ మండల అధ్యక్షుడు రాముడు, ఉపాధ్యక్షులు శంకర్, కణేకల్లు మండల అధ్యక్షులు వెంకటేష్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం మానవ మనుగడకు సవాల్‌గా మారిందని, దీనికి పరిష్కారం విస్తృతంగా మొక్కలు నాటడమేనని వక్తలు అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.