రాయదుర్గం: పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం, ఆయుష్మాన్ హెల్త్ కార్డులు అందజేత
రాయదుర్గం మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు, వీధుల్లో చెత్త ఏరుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న నమస్తే స్కీమ్ ద్వారా ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని వారికి ఈ కార్డులు అందజేశారు. ఈ స్కీమ్ ద్వారా రూ. 5 లక్షల వరకు విలువైన వైద్యం ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుతుందని మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. డిసిహెచ్ ఎస్ వెంకట్రావు, ఆసుపత్రి అని సలహా మండలి సభ్యులు, వైద్యులు పాల్గొన్నారు.