దర్శి: కురిచేడులో నెల రోజులుగా నిలిచిన తాగునీటి సరఫరా: రోడ్డెక్కిన గ్రామస్థులు
Darsi, Prakasam | Sep 28, 2026 ప్రకాశం జిల్లా కురిచేడులో నెల రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం కోరుతూ ఎరుకల కాలనీ వాసులు ఖాళీ బిందెలతో వినుకొండ-పొదిలి రహదారిపై నిరసన తెలిపారు. ఎంపీడీవో హామీతో ఆందోళన విరమించారు.