రాయదుర్గం: 6 గంటల్లో బాలుడి ఆచూకీ కనుగొన్న కనేకల్ పోలీసులు అనంతపురం రైల్వే స్టేషన్‌లో సురక్షితంగా రెస్క్యూ
కణేకల్లు బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి శివకుమార్ కనిపించకుండా పోగా, పోలీసులు వేగంగా స్పందించి 6 గంటల్లోనే ఆచూకీ కనుగొన్నారు. బుధవారం టిఫిన్ తర్వాత బయటకు వెళ్లిన శివకుమార్ ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన కనేకల్లు ఎస్ఐ నాగమధు బృందం గాలింపు చేపట్టి అనంతపురం రైల్వే స్టేషన్‌లో బాలుడిని సురక్షితంగా గుర్తించి కుటుంబానికి అప్పగించారు.