గుమ్మడిదల: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై అధికారులకు చైర్మన్ ఆదేశాలు
గుమ్మడిదల మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్ష జరిగింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణ నిధులు విడుదల చేసేలా ప్రక్రియను వేగవంతం చేయాలని చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ అధికారులను ఆదేశించారు.