రాయదుర్గం: వీధికుక్క దాడి, మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు
రాయదుర్గం పట్టణంలోని ఓబులాచారి రోడ్డు మారెమ్మ గుడి ఏరియాలో వీధికుక్క దాడిలో మూడేళ్ల బాలుడు గాయపడ్డాడు. గురువారం రాత్రి పాలన్న, లక్ష్మి దంపతుల కుమారుడు సంజయ్ ఇంటి మముందు ఆడుకుంటుండగా కుక్క ఒక్కసారిగా మొహంపైబ కరిచి పట్టి లాగింది. గమనించిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో కుక్క వదిలి పారిపోయింది. తీవ్ర గాయాలతో ఉన్న బాలుడిని వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు మరో ఆసుపత్రికి రిఫర్ చేశారు.