మార్కాపురం: మార్కాపురం డీఎస్పీ నాగరాజుకు ఘనంగా వీడ్కోలు
మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు 37 ఏళ్ల పోలీస్ సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆయన సేవలను కొనియాడుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.