రాయదుర్గం: తెలుగుదేశం హయాంలోనే అభివృద్ధి.. టిడిపి జిల్లా కోశాధికారి కడ్డిపూడి మహబూబ్ బాషా
తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాయదుర్గం పట్టణాభివృద్ధి జరిగిందని వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిఓదని టిడిపి జిల్లా కోశాధికారి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కడ్డిపూడి మహబూబ్ బాషా అన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టణ ఇంచార్జ్ టంకశాల హనుమంతుతో కలసి ఆదివారం 5 వ వార్డు లో పర్యటించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డులో జమ్మిచెట్టు వీధి, మటన్ మార్కెట్ పక్క వీధిలో జరుగుతున్న సిసి రోడ్ల నిర్మాణం, పలు అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. పనులు నాణ్యతగా చేపట్టాలని ఆదేశించారు. ఎన్నో ఏళ్లుగా సిమెంట్ రోడ్డు లేక ఇబ్బందులు పడ్డామని స్థానికులు తెలిపారు.