రాయదుర్గం: పట్టణంలో ఘనంగా జూనియర్ కళాశాల విద్యార్థుల హర్ ఘర్ తిరంగా ర్యాలీ
రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు గురువారం హర్ ఘర్ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రిన్సిపాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కళాశాల నుంచి త్రివర్ణ పతాకాలు చేతబూని కణేకల్లు రోడ్డు మీదుగా లక్ష్మీబజార్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం విద్యార్థులందరూ సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొని జాతీయ భావాన్ని చాటారు.