రాయదుర్గం: భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి : పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్
భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని PDSU జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం కణేకల్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో PDSU ఆధ్వర్యంలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యారంగ సమస్యలపై పోరాడుతామన్నారు. మండల నాయకులు వన్నూరుస్వామి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.