రాయదుర్గం: పట్టణంలో విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయం ప్రారంభం
రాయదుర్గం పట్టణంలోని స్వర్ణాంద్ర విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు సోమవారం ప్రారంభించారు. శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం 2027 విజన్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం రాయదుర్గం నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఇక్కడ నుంచే ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రతాప్, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, ఎంపిడివో కొండన్న, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.