అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీ వద్ద శుక్రవారం 11:30 గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు ఎస్కే యూనివర్సిటీ ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఉమా మహేష్ రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఉమా మహేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 2025 మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిపిఐ చేత విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఏఐఎస్ఎఫ్ ఉమామహేష్ పేర్కొన్నారు.