రాప్తాడు: SC ST కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి అనంతపురంలో రాప్తాడు APMRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్
అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేసి దళితుల అభివృద్ధికి సహకరించాలన్నారు లేకుంటే దళిత సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వమే ఆందోళన చేపడుతామని రాప్తాడు ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓబులేష్ ప్రభుత్వానికి హెచ్చరించారు, ఈ సమావేశంలో దళిత సంఘం నేతలు పాల్గొన్నారు.