రాయదుర్గం: వెట్టి చాకిరీ విముక్తి ఘటనపై మీడియాతో మాట్లాడుతున్న రెడ్స్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ బానూజ
మహారాష్ట్ర నుంచి సుమారు 7 వేల మంది వచ్చి బొగ్గు కాల్చే పనిలో రాయలసీమ జిల్లాల్లో ఉన్నారని తెలిపారు. వెట్టిచాకిరీ ఘటనపై రెడ్స్ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ బానూజ మీడియాతో మాట్లాడారు. తక్కువ కూలీతో ఐదేళ్లుగా పని చేస్తున్న బొమ్మనహల్, రాయదుర్గం డి.హీరేహల్ మండలాల్లోని 98 మందిని జిల్లా కలెక్టర్ సహకారంతో ఆర్డీవో ఆధ్వర్యంలో రెస్కూ చేసి కాపాడామన్నారు. సొంత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. 9 మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.