రాయదుర్గం: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పట్టణంలో 3 కె ఎకో వాక్ నిర్వహించిన ఫారెస్టు అధికారులు
వరల్డ్ టూరిజం డే సందర్భంగా ఆదివారం రాయదుర్గం పట్టణంలోని నగరవనం పార్కు లో ఫారెస్టు అధికారులు 3 కె ఎకో వాక్ అండ్ బోర్డ్ వాచ్ నిర్వహించారు. వాక్ ఫర్ నేచర్, వాచ్ ద వైల్డ్ అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫారెస్టు రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, బీట్ ఆఫీసర్లు అటవీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. చెట్లు మానవ మనుగడకు ఆధారమని, ప్రకృతి తో మనిషి మమేకమవ్వాలని అధికారులు వివరించారు. వన్యప్రాణులు, పక్షులకు హాని కలిగించకుండా ఉండాలని సూచించారు.