నిజామాబాద్ నార్త్: నిజామాబాద్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు: పాల్గొన్న జె.డి. లక్ష్మీనారాయణ
నిజామాబాద్‌లోని పైడి కన్వెన్షన్ హాల్లో ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో రిటైర్డ్ అడిషనల్ డీజీపీ జె.డి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించిన ఆయన, విద్యార్థుల అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్రపై దిశానిర్దేశం చేశారు.