రాయదుర్గం: కులవివక్ష పై కలాన్ని ఆయుధంగా మలచిన గుఱ్ఱం జాషువా : కెటిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సహదేవుడు
కులవివక్ష, అంటరానితనంపై గుఱ్ఱం జాషువా తన కలాన్ని ఆయుధంగా మలిచారన్నారని రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సహదేవుడు అన్నారు. తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతిని సోమవారం కళాశాల ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో నవయుగ కవిచక్రవర్తి కవికోకిల వంటి బిరుదులతో చిరస్మరణీయుడిగా నిలిచామని కొనియాడారు. తెలుగు అదాయాపకులు డి. నారాయణ, నాగరాజు మాట్లాడుతూ గబ్బిలం, పిరదౌషి, స్మశాన వాటిక ముంతాజ్ మహల్ వంటి రచనల ద్వారా సామాజిక న్యాయం, సమానత్వాన్ని చాటారన్నారు.