రాయదుర్గం: విద్యుత్ షాక్ తో చెర్లోపల్లి గ్రామానికి చెందిన యువ రైతు మృతి
డి.హిరేహాల్ మండలం చెర్లోపల్లి కి చెందిన రైతు సతీష్ రెడ్డి(31) విద్యుత్ షాక్ తో మరణించారు. గురువారం మధ్యాహ్నం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన సతీష్ రెడ్డి, ఐరన్ పైపునకు వైర్లు తగిలి ఉండటం గమనించకుండా పట్టుకోవడంతో షాక్ కు గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. చుట్టుపక్కల రైతులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.