సంతనూతలపాడు: చీమకుర్తి మండలం తొర్రిగుడిపాడు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రిగుడిపాడు గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.4,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామని పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పోలీసులు మండల ప్రజలను హెచ్చరించారు.