నస్పూర్: నస్పూర్లో సింగరేణి బకాయిలపై బీజేపీ నిరసన.. రూ.55 వేల కోట్లు చెల్లించాలని ఈటల డిమాండ్
మంచిర్యాల జిల్లా నస్పూర్లో సింగరేణి బకాయిలపై బీజేపీ నిరసన చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.55 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని ఆయన పేర్కొన్నారు.