మంచిర్యాల: సింగరేణి కార్మికుల కోసం బీజేపీ పోరుబాట: ప్రభుత్వంపై రఘునాథ్ రావు ఆగ్రహం
సింగరేణి కార్మికుల సమస్యలపై బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. నస్పూర్ వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఔట్సోర్సింగ్ విధానంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని ప్రకటించారు.