రాయదుర్గం: మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేత్రపల్లిలో ఘనంగా తిరంగా ర్యాలీ
గుమ్మగట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం వందలాది మంది విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశభక్తి, క్రమశిక్షణ అలవరుచుకుని భరతమాత సేవకు పునరంకిదమవుదామని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు.