మార్కాపురం: జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలు
మార్కాపురం జిల్లా కేంద్రంలో 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మున్సిపల్ అధికారులు ప్రధాన కూడలిలో ప్రత్యేకంగా త్రివర్ణ పతాకం రంగులతో లైటింగ్ ఏర్పాటు చేశారు. రాత్రి సమయాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.