రాయదుర్గం: కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో "మత్తు రహిత భారత్" పై అవగాహన సదస్సు
రాయదుర్గం కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలో ఎన్ఎస్ఎస్, బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో "వికసిత భారత్ కొరకు మత్తు రహిత యువత" కార్యక్రమంపై అ అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపాల్ డా. డి.సహదేవుడు మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి జోలికి వెళ్లవద్దని సూచిస్తూ మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై వివరించారు. ముఖ్య అతిథి యోగేశ్వరి విద్యార్థులతో "నిషా ముక్త భారత్" ప్రతిజ్ఞ చేయించారు. ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు, అధ్యాపకులు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.