రాయదుర్గం: రైతులను ఆదుకోవాలంటూ కణేకల్లు లో సిపిఐ ధర్నా
రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనేకల్ లోని వ్యవసాయ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఏఓకు వినతిపత్రం ఇచ్చారు. మండల కార్యదర్శి ఎం.గౌస్ పీర్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వమే సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పిచికారీ మందులు అందించాలని కోరారు. వ్యవసాయ అధికారులు పొలాలకు వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ప్రజా సంఘాలతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.