లింగాల ఘనపూర్: స్టేషన్ ఘనపూర్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను: కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటించారు. వనపర్తి, కొత్తపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. తన 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అవినీతికి చోటు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.