రాప్తాడు: శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిషా ముక్తి భారత్ అభియాన్ ర్యాలీని నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఎస్కే యూనివర్సిటీ వద్ద బుధవారం 11:30 గంటల సమయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిషా ముక్తి భారత్ అభియాన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి జ్యోతి కుమార్ మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిషాముక్తి ర్యాలీ నిర్వహించి మార్గద్రవ్యాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలు గురించి విద్యార్థినిలకు ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని మత్తు పదార్థాలు వినియోగించడం వల్ల కలిగే అనర్ధాలు గురించి విద్యార్థినిలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని ఎస్కే యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు.