నిజామాబాద్ నార్త్: లాల్ బహదూర్ శాస్త్రి జయంతి: నగరంలో ఘనంగా నివాళులర్పించిన అధికారులు
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని నగరంలో నివాళులర్పించారు. మేయర్ ఉమారాణి, అదనపు కలెక్టర్ భుజంగరావు, కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. శాస్త్రి గారి సేవలను, నినాదాలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకున్నారు.