నిజామాబాద్ రూరల్: గాంధీ జయంతి వేళ బీజేపీ ప్రభుత్వంపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఫైర్
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, ఓటు హక్కును బలహీనపరిచేలా అక్రమాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కూడా ఆయన విమర్శలు చేశారు.