రాప్తాడు: పేరూరు అనంత గ్రామీణ బ్యాంకు వద్ద రైతు రుణాలు రెన్యువల్ చేయాలని రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
సత్య సాయి జిల్లా రామగిరి మండలం పేరూరు అనంత గ్రామీణ బ్యాంకు వద్ద శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవ ఆధ్వర్యంలో రైతులకు లోన్లు రెన్యువల్ చేయాలని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం కార్యదర్శి మహదేవయ్య, వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు క్రాఫ్ లోన్లు రెన్యువల్ చేసుకునేందుకు గడువు పెంచిన గ్రామీణ బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం కారణంగా కొంతమంది రైతులు రెన్యువల్ చేసుకోలేదని ఇప్పటికైనా రెన్యువల్ చేసుకునేందుకు గడువు పెంచాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవ వెంకటేష్ బ్యాంకు అధికారులను డిమాండ్ చేశారు.