రాయదుర్గం: పట్టణ, రూరల్ మండల పరిధిలోని 81 పాఠశాలల్లో సజావుగా విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు
రాయదుర్గం పట్టణ, మండల పరిధిలోని 77 ప్రభుత్వ, 8 ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా కమిటి చైర్మన్ ఎన్నికలు మంగళవారం సజావుగా జరిగాయని MEO ఇర్షాద్ మహమ్మద్, అర్బన్ సిఐ దేవానంద్ తెలియజేశారు. రూరల్ మండలం ఆయతపల్లి గ్రామంలో తల్లిదండ్రులు సుముఖత చూపకపోవడంతోపాటు అభ్యంతరాలు చెప్పడంతో ఎన్నిక వాయిదా పడిందన్నారు. బుధవారం రీ-ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా ఆయా పాఠశాలల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టామని సిఐ తెలిపారు.