రాయదుర్గం: రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు విద్యుత్ కాంతుల శోభ
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పోలీసు స్టేషన్ సుందరంగా ముస్తాబైంది. సిఐ వెంకటరమణ, ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో స్టేషన్ భవనం, పరిసరాలకు త్రివర్ణ రంగుల లైటింగ్ ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న పోలీసు స్టేషన్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆగస్టు 15న పంద్రాగస్టు వేడుకలను కనీవినీ ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సిఐ వెంకటరమణ తెలిపారు.