నంద్యాల అర్బన్: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీతో దీక్ష విరమణ చేసిన నూనెపల్లి అభివృద్ధి కమిటీ
Nandyal Urban, Nandyal | Sep 30, 2026
నంద్యాల పట్టణంలోని నూనెపల్లె ప్రాంత అభివృద్ధి కోసం 'నూనెపల్లె అభివృద్ధి కమిటీ' చేపట్టిన రిలే నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమిటీ సభ్యులు దీక్ష శిబిరంలో నిరసన కొనసాగించారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దీక్ష శిబిరాన్ని సందర్శించి కమిటీ సభ్యులతో మాట్లాడారు. కమిటీ ప్రస్తావించిన డిమాండ్లను పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు.