రాప్తాడు: ముత్తుగుంట్లలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించిన టిడిపి నేతలు
సత్య సాయి జిల్లా కనగానపల్లి మండలం ముత్తుగుంట్ల గ్రామంలో గురువారం ఐదున్నర గంటల సమయంలో కనగానపల్లి టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు టిడిపి నేతలతో కలిసి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, ఎంపీటీసీ శ్రీరాములు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ముత్తుకుంట్ల గ్రామంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం ప్రజలకు వివరించి ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించామని కనగానపల్లి టిడిపి నేతలు పేర్కొన్నారు.