మార్కాపురం: రాజ్యలక్ష్మి కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలోని 31 వ వార్డు రాజ్యలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. జిల్లా కేంద్రంలోని పలు వార్డులలో అభివృద్ధి కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి రోడ్డును సిసి రోడ్డుగా మారుస్తామని అభివృద్ధికి చిరునామా మార్కాపురం పని చెప్పుకునేలా చేస్తామన్నారు.