రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 52 మందికి 54 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు ఆదివారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 52 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి రామగిరి మండలాలకు చెందిన 52 మంది 54,39 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలు అందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు తమ వంతు సహకారం కూడా అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.