మార్కాపురం: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ వారి ఆధ్వర్యంలో నూతన ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరేట్లో తాగునీటి సౌకర్యార్థం యూనియన్ బ్యాంక్ రీజనల్ అధికారులు ప్లాంట్ ఏర్పాటు చేశారని ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. ప్రజలకు తాగునీరు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటుందన్నారు.