వనపర్తి: వనపర్తిలో తప్పిన ఘోర ప్రమాదం: పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
వనపర్తి మండలం మెట్టుపల్లి సమీపంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉండగా, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ట్రాక్టర్ సాయంతో కారును బయటకు తీశారు.