గజపతినగరం: గంట్యాడలో వైభవంగా సాగిన వినాయక నిమజ్జన ఊరేగింపు
గంట్యాడ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో వినాయక నిమజ్జన ఊరేగింపు ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. డప్పు వాయిద్యాలు, భక్తుల జై గణేష్ నినాదాల మధ్య గాంధీబొమ్మ జంక్షన్ మీదుగా సాగిన ఈ వేడుకల్లో స్థానికులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.