గిద్దలూరు: బేస్తవారిపేట మండలంలో మనోజ్ చారిటబుల్ ట్రస్ట్, సుభోజనం సేవా సంస్థలు ఇంటింటికి ఆహారాన్ని పంపిణీ కార్యక్రమం ప్రారంభం
మార్కాపురం జిల్లాలో వృద్ధులకు, వికలాంగులకు ఇంటింటికి ఆహారాన్ని క్యారేజీ రూపంలో అందించే కార్యక్రమానికి సుభోజనం, మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ సేవా సంస్థలు శ్రీకరం చుట్టాయి. బేస్తవారిపేట మండలంలో నా అనేవాళ్ళు ఎవరూ లేక మంచానికే పరిమితమై ఆహారానికి అవస్థలు పడే వృద్ధులను వికలాంగులను గుర్తించి సుభోజనం, మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి స్వచ్ఛంద సేవ సంస్థలు 12 గ్రామాలలో 64 మందికి ఇంటికే ఆహారాన్ని క్యారేజీ రూపంలో రెండు పూటలా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కామూరి రమణారెడ్డి తెలిపారు. మొదటి విడతగా బేస్తవారిపేట మండలంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.