నారాయణపేట్: నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ ప్రియాంక ఆకస్మిక తనిఖీ
నారాయణపేట ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మిక తనిఖీ చేశారు. పెండింగ్ ఫైళ్లు, మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ మరియు రికార్డుల నిర్వహణపై అధికారులతో సమీక్ష జరిపి, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.