రాజమండ్రి సిటీ: అక్టోబర్ 4న రాజమండ్రిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల 'గోదావరి మహాగర్జన'
అక్టోబర్ 4న రాజమండ్రిలోని రవణం శ్రీరాములయ్య కళ్యాణ మండపంలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రాంతీయ సదస్సు జరగనుంది. కనీస వేతనాలు, సౌకర్యాల కల్పన కోసం ఏపీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ జేఏసీ ఈ గోదావరి మహాగర్జనను నిర్వహిస్తోంది.