కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు వైసిపిని వీడి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిన 46 కుటుంబాలు
కనిగిరిలోని అమరావతి గ్రౌండ్లో పామూరు మండలం నర్ర మారెళ్ళ గ్రామానికి చెందిన 46 కుటుంబాలు వైసిపిని వీడి ఎమ్మెల్యే ఉగ్ర సమక్షంలో టీడీపీ లో చేరారు. ఎమ్మెల్యే ఉగ్ర సింహారెడ్డి వారికి టిడిపి కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు కమిట్మెంట్తో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.