శ్రీశైలం: ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పెద్దపులి మృతిఘటనలో,6గురు ప్రొటెక్షన్ వాచర్లను విధుల నుంచి తొలగింపు, FSO సస్పెన్షన్
ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పెద్దపులి మృతి ఘటన కలకలం రేపుతోంది. ఏడాది క్రితం నాగలూటి రేంజ్ ఇందిరేశ్వరం బీట్‌లో ఆడపులి ఉచ్చులో చిక్కుకుని మృతి చెందింది. అయితే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అటవీ సిబ్బంది మృతి చెందిన పులిని కాల్చివేసినట్లు అధికారులు గుర్తించారు.అటవీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఘటనపై ఆరుగురు ప్రొటెక్షన్ వాచర్లను శాశ్వతంగా విధుల నుంచి తొలగించామని, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మహబూబ్ బాషాపై సస్పెన్షన్ వేటు వేశామని ఆత్మకూరు డీఎఫ్‌ఓ విఘ్నేష్ అప్పావ్ తెలిపారు. ఘటనపై మరింత విచారణ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.