యర్రగొండపాలెం: పుల్లలచెరువు కేజీబీవీ బాలికల పాఠశాలలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే చంద్రశేఖర్ డిమాండ్
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు కేజీబీవీ బాలికల పాఠశాలలో తాగునీరు కనీస అవసరాలకు నీరు లేక బాలికలు బకెట్లు పట్టుకొని బయటకు వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికలకు నీళ్లు అందించలేని మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు విద్యాశాఖ తక్షణమే స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.