నంద్యాల అర్బన్: సెప్టెంబర్ నెలలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 2200 కేసులు నమోదు : జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | Oct 2, 2026
నంద్యాల జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ నెలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, 2,220కు పైగా కేసులు నమోదు చేశారు. వాటిలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 914 డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులు, 1,204 ఓపెన్ డ్రింకింగ్ కేసులు, మైనర్లు వాహనాలు నడిపినందుకు 160 కేసులు నమోదుతో పాటు 83 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.