ఉరవకొండ: జీడిపల్లి రిజర్వాయర్ కు చేరిన కృష్ణా జలాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ కు మంగళవారం కృష్ణా జలాలు హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చి చేరాయి. జిల్లాలోని రాగులపాడు వద్ద నున్న ఎనిమిదో లిఫ్ట్ నుండి సుమారు 2700 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్ పంపుల ద్వారా హంద్రీనీవా కాలువకు ఎత్తిపోతలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. జీడిపల్లి రిజర్వాయర్కు హంద్రీనీవా కాలువల ద్వారా వస్తున్న నీటిని రైతులు వ్యవసాయ పనులకు వినియోగించ రాదని బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్ ప్రకటనలు పేర్కొన్నారు. జీడిపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.67 టిఎంసిలు కాగా ప్రస్తుతం జీరో పాయింట్ మూడు టీఎంసీలు మాత్రమే నిల్వవుంది