కనిగిరి: సిఎస్పురం మండలం డిజిపేటలో వృద్ధురాలిని హత్య చేసిన ఘటన పై దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు
మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డిజిపేట గ్రామంలో వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత మార్చారు. వృద్ధురాలి మెడలో మరియు ముక్కుకి ఉన్న బంగారాన్ని దుండగులు దొంగిలించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలనే వృద్ధురాలని హత్య చేశారా లేక బంగారం కొరకు హత్య చేశారా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తులో గుర్తించవలసి ఉందని తెలిపారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.