డోన్: ప్యాపిలి లో తప్పిన పెను ప్రమాదం, అదుపుతప్పి లోయలోకి వెళ్ళబోయిన లారీ
Dhone, Nandyal | Oct 2, 2026 నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల సమీపంలో శుక్రవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక లారీ వేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రమాదకర లోయలో పడబోయింది. సమయానికి లారీ నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పి, డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఇదే ప్రాంతంలో కొన్ని నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.