సూర్యాపేట: సూర్యాపేటలో ఘోర ప్రమాదం: సజీవ దహనమైన ఖమ్మం ప్రముఖ న్యూరో సర్జన్
సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం మమత ఆసుపత్రి న్యూరో సర్జన్ కాసకుర్తి జగదీష్ మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొని మంటలు చెలరేగడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.